ఒకే సరిహద్దు.. మూడు శత్రు దేశాలు

by Shamantha N |   (  Updated:2025-07-04 10:32:00  IST  )

చైనా తన సైనిక శక్తిని పరీక్షించడానికి పాకిస్థాన్ ను ఒక ల్యాబ్ గా వాడుకుంటోందని భారత డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాప్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ అన్నారు.

ఒకే సరిహద్దు.. మూడు శత్రు దేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా తన సైనిక శక్తిని పరీక్షించడానికి పాకిస్థాన్ ను ఒక ల్యాబ్ గా వాడుకుంటోందని భారత డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాప్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ లో 81 శాతం మిలిటరీ హార్డ్ వేర్ డ్రాగన్ కంట్రీకి చెందినదే అన్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన వివరాలను ఆయన వెల్లడించారు. దేశానికి సరిహద్దుల్లో ముగ్గురు శత్రువులు ఉన్నారు. మొదటిది పాకిస్థాన్ అయితే రెండోది చైనా, డ్రాగన్ కంట్రీ నుంచే పాక్ కు అన్ని రకాల సాయం అందుతోంది. తుర్కియే కూడా పాకిస్థాన్ కు సపోర్టు చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌) స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు భారత్ చేయాలనుకున్న దాడులు, వ్యుహాలను బీజింగ్ నుంచి పాక్ కు చేరవేశారని రాహుల్ సింగ్ ఆరోపించారు.

8. 2 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయం

చైనా 2015 నుంచి 8.2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించినట్లు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ (SIPRI) తెలిపింది. భారతదేశం చైనాను తమ ప్రధాన శత్రవుగా భావిస్తోంది. 2025లో యూఎస్‌ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారత్ చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తున్నప్పటికీ పాక్ ను ఎదుర్కొవాల్సిన సమయంలో సమస్యగా పరిగణిస్తోందని పేర్కొంది. చైనా నుంచి పాక్‌తెచ్చుకున్న హెచ్ క్యూ 9, ఎల్ వై రాడార్లు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణిని కూడా ఆపలేకపోయాయి.

Next Story