- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ బిల్లు ఒకే చేస్తే తెల్లారే ‘ది అమెరికన్ పార్టీ’ పెడతాను : ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఓకే చేస్తే తెల్లారే ‘ది అమెరికన్ పార్టీ’ పెడతానని మస్క్ హెచ్చరించారు. దీని కోసం తాను ఎంత వరకైనా రెడీ అని అంటున్నారు. ఈ బిల్లులో రక్షణ, ఉత్పత్తి సరిహద్దు భద్రత కోసం మరిన్ని నిధులు కేటాయించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. పోషకాహార, ఆరోగ్య సంరక్షణ ప్రోగ్రాములపై ఖర్చులను తగ్గించాలన్న అంశాలు ఉన్నాయి. దీంతో తీవ్రంగా స్పందించిన మస్క్ హౌస్ ఫ్రీడమ్ కాక్‌సస్ చైర్మన్ ఆండీ హారిస్‌ను ఉద్దేశిస్తూ ఇది రుణ పెంపును మద్దతు ఇచ్చే బిల్లు మీరు దీన్ని ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. ఈ బిల్లు దేశానికి వినాశకరమని మస్క్ అన్నారు. ఎవరైనా సరే ఈ బిల్లుకు మద్దతిస్తే వారిని ఓడించేందుకు వచ్చే ఎన్నికల్లో ప్రయత్నిస్తానని చెప్పారు. ట్యాక్స్ కోతలను 4.5 ట్రిలియన్ డాలర్ల మేర పొడిగించడం, సైనిక వ్యయాన్ని పెంచడం, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వలసదారుల భారీ బహిష్కరణలకు నిధులు సమకూర్చడం ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడంతో మస్క్ ఎదురుతిరిగాడు. ఈ బిల్లు వల్ల దేశ జాతీయ పదేళ్లలో 3.3 ట్రిలియన్ డాలర్ల లోటు ఏర్పడుతుందని మస్క్ ఆరోపించారు. లక్షలాది మంది అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలలో సుమారు 1 ట్రిలియన్ డాలర్ల కోత పడుతుందని విమర్శలు చేశారు. ఇది దేశ సంక్షేమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నారు.
గతంలోనే కొత్త పార్టీ గురించి ఓటింగ్
గత నెలలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ‘ఎక్స్’ లో మస్క్ ఓటింగ్ నిర్వహించారు. 80 శాతం మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. దీంతో అమెరికా కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటుందని ఇప్పటికే ప్రకటించారు. కాగా బిగ్ బ్యూటీఫుల్ బిల్లు ఆమోదం పొందితే తెల్లావారే ‘ది అమెరికన్ పార్టీ’ పెడతానని మళ్లీ తాజా ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే మస్క్ ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) నుంచి తప్పించినందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.






