స్కూల్లో విద్యార్థుల పట్ల మత వివక్ష.. ఇన్‌సైట్ యూకే సంస్థ ఆగ్రహం

by Naga Rani Yarlagadda |

స్కూల్ విద్యార్థుల పట్ల మత వివక్ష చూపించడంపై ఇన్ సైట్ యూకే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

స్కూల్లో విద్యార్థుల పట్ల మత వివక్ష.. ఇన్‌సైట్ యూకే సంస్థ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ విద్యార్థుల పట్ల మత వివక్ష చూపించడంపై ఇన్ సైట్ యూకే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. లండన్లో ఉన్న ఓ స్కూల్లో ఎనిమిదేళ్ల విద్యార్థి తిలకం పెట్టుకోవడంతో ఈ వివక్షను ఎదుర్కొన్నట్లు సదరు సంస్థ పేర్కొంది. ఫలితంగా ఆ చిన్నారి స్కూల్ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందింది. బ్రిటన్లో హిందువులు, భారతీయులకు ప్రాతనిధ్యం వహించే ఈ సంస్థ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ విద్యార్థి తమ సంప్రదాయాల ప్రకారం నుదిటిన తిలకం పెట్టుకుని స్కూలుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అతని మతపరమైన ఆచారాలపై స్కూల్ సిబ్బంది ఆరా తీయడం, తోటి విద్యార్థులతో ఆడుకునేటపుడు అతనిపై హెడ్ టీచర్ స్పెషల్ గా దృష్టి పెట్టడం వంటివి చేశారు. దీంతో భయపడిన విద్యార్థి ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తమ మత విశ్వాసాలపై వివరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. ఇది రుజువైతే స్కూలుపై మత వివక్ష కేసు నమోదయ్యే ఛాన్స్ ఉందని సంస్థ తెలిపింది. కాగా.. ఇలా మతవివక్ష చర్యల కారణంగా ఇప్పటి వరకూ నలుగురు విద్యార్థులు స్కూల్ నుంచి వెళ్లిపోయినట్లు ఇన్ సైట్ యూకే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story