BIG BREAKING: డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 45 మంది సజీవదహనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-17 07:37:05  IST  )

భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు దగ్ధమవ్వగా..

BIG BREAKING: డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 45 మంది సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న వరుస బస్సు ప్రమాదాలు.. ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు దగ్ధమవ్వగా.. అందులో ఉన్న 45 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడగా.. అతనికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బదర్ - మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాదీయులేనని గుర్తించారు. వీరిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Next Story