- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్విట్జర్లాండ్ పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్ లో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. బార్ లో పేలుడు జరగ్గా 40 మంది పర్యాటకులు మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్ లో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. బార్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా.. స్థానిక కాలమానం ప్రకారం అర్థరాత్రి 1.30 గంటలకు భారీ శబ్దంతో పేలుడు జరిగింది. స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలో ఉన్న బార్ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బార్ లో 100 మందికి పైగా ప్రజలు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని పోలీసులు, అధికారులు చెబుతున్నారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని, దానిపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. భారీ పేలుడుతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






