- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై ... 40 హత్య కేసులు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. తిరుగుబాటు తర్వాత ఆమె భారత్ లో ఆశ్రయం పొందారు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. తిరుగుబాటు తర్వాత ఆమె భారత్ లో ఆశ్రయం పొందారు. ఈ పరిణామాల అనంతరం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లా లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు వారి మాజీ మంత్రి వర్గ సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులతో సహా అందరిపైనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా పై 40 హత్య కేసులు నమోదయ్యాయి. ఇవి మాత్రమే కాకుండా ఆమెపై మారణ హోమం, మానవత్వం నేరాలకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. హసీనా, ఆమె మాజీ మంత్రివర్గ సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులపైనా కనీసం ఐదు హత్య కేసులు గురువారం నమోదైనట్లు సమాచారం. బంగ్లా డైలీ స్టార్ వార్తాపత్రిక కథనం ప్రకారం.. షేక్ హసీనా, ఆమె మాజీ సహాయకులపై ఐదు కేసులలో మూడు ఢాకాలో, రెండు కేసులు నార్సింగి, బోగురాలలో నమోదైనట్లు తెలుస్తోంది.






