ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. ఉగ్రరూపం దాల్చిన నిరసనల్లో 35 మంది మృతి

by Malleboina Mahesh |   (  Updated:2026-01-06 05:07:50  IST  )

ఇరాన్‌లో ఆర్థిక మాంద్యం, నిత్యావసరాల ధరల భారీగా పెరుగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. ఉగ్రరూపం దాల్చిన నిరసనల్లో 35 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌లో ఆర్థిక మాంద్యం (Economic depression), నిత్యావసరాల ధరల భారీగా పెరుగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. వారం రోజులుగా సాగుతున్న ఈ నిరసనల్లో ఇప్పటి వరకు కనీసం 35 మంది మరణించారని, వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని అమెరికాకు చెందిన 'హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ' (HRANA) వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1,200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్ కరెన్సీ (రియల్) విలువ పడిపోవడం, జీవన వ్యయం భారంగా మారడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఈ ఆందోళనలు దేశంలోని 31 రాష్ట్రాలకు గాను 27 రాష్ట్రాల్లోని 250కి పైగా ప్రాంతాలకు విస్తరించాయి. శాంతియుతంగా నిరసనలు తెలిపే వారిపై బలప్రయోగం జరిగితే అమెరికా జోక్యం చేసుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు హెచ్చరించగా, ఇరాన్ ప్రభుత్వం మాత్రం అల్లరిమూకలను అణచివేస్తామని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి (UN) కూడా స్పందిస్తూ, తదుపరి ప్రాణనష్టాన్ని నివారించాలని, ప్రజల వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించాలని ఇరాన్ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలు ఇతర దేశాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More..

తైవాన్ చుట్టూ చైనా సైనిక బలప్రదర్శన.. సరిహద్దుల్లో హై అలర్ట్!

Next Story