మెట్రో స్టేషన్లో ముగ్గురి హత్య

by Naga Rani Yarlagadda |

తైవాన్లోని తైపీ మెట్రో స్టేషన్లో శుక్రవారం జరిగిన స్మోక్ గ్రనేడ్, కత్తి దాడిలో ముగ్గురు మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు.

మెట్రో స్టేషన్లో ముగ్గురి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తైవాన్లోని తైపీ మెట్రో స్టేషన్లో శుక్రవారం జరిగిన స్మోక్ గ్రనేడ్, కత్తి దాడిలో ముగ్గురు మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు. మృతుల్లో దాడికి పాల్పడిన వ్యక్తి కూడా ఉన్నట్లుగా తెలిసిందన్నారు. తైపీ, జోంగ్ షాన్ స్టేషన్లలో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు జరిగినట్లు తైవాన్ ప్రీమియర్ చో జంగ్-తాయ్ అన్నారు. అయితే ఇందుకు కారణమేంటో ఇంకా తెలియలేదన్నారు. అనుమానితుడు ముసుగు ధరించి తైపీ మెయిన్ స్టేషన్ వద్ద ఐదు లేదా ఆరు గ్యాసోలిన్ బాంబులు లేదా పొగ గ్రెనేడ్లను విసిరాడని చో ఒక ప్రకటనలో తెలిపారు. తైపీ నగర అగ్నిమాపక విభాగం ప్రకారం, అనుమానితుడు సహా మొత్తం నలుగురు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని నిర్ధారించారు. ఈ దాడుల నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, హైవేలు, సబ్వే స్టేషన్లు, విమానాశ్రయాలు సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో అధిక స్థాయిలో హెచ్చరికలు, నిఘాను నిర్వహిస్తున్నట్లు చో వెల్లడించారు. 2014లో తైపీ మెట్రోలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు పాల్పడి నలుగురిని చంపగా.. 2016లో అతనికి ఉరిశిక్ష పడింది.

Next Story