- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
School Accident : స్కూల్లో ట్రాన్స్ఫార్మర్ పేలి 29 మంది విద్యార్థులు మృతి
పాఠశాల ఆవరణలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి(Transformer exploded) 29 మంది విద్యార్థులు మృతి(Students Died) చెందిన ఘటన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(Central African Republic) లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : పాఠశాల ఆవరణలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి(Transformer exploded) 29 మంది విద్యార్థులు మృతి(Students Died) చెందిన ఘటన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(Central African Republic) లో చోటు చేసుకుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగి నగరంలోని ఓ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం స్కూల్ పరిసరాల్లోనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలి పోయింది. అయితే ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు ఒక్కసారిగా పాఠశాల బయటికి పరుగెత్తడానికి చిన్న ఇరుకైనా గేటు వద్దకు పరుగెత్తడంతో భారీగా తొక్కిసలాట(Stampede) జరిగింది.
ఈ ప్రమాదం జరిగినపుడు స్కూల్లో 5 వేల మంది విద్యార్థులున్నారని తెలిపిన అధికారులు.. ఈ ఘటనలో మొత్తం 29 మంది విద్యార్థులు మృతి చెందగా, మరో 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నారు. వీరిలో అనేకమంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలుడు గల కారణాలపై ప్రభుత్వం నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.






