- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఎట్టకేలకు మంగోలియా నుంచి తిరిగొచ్చిన 228 మంది భారతీయులు.. ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీలో ల్యాండ్
ఎట్టకేలకు మంగోలియా నుంచి తిరిగొచ్చిన 228 మంది భారతీయులు.. ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీలో ల్యాండ్
మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో చిక్కుకున్న 228 మంది భారత ప్రయాణికులు ఎట్టకేలకు సేఫ్‌గా తిరిగొచ్చారు.

X
దిశ, వెబ్ డెస్క్: మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో చిక్కుకున్న 228 మంది భారత ప్రయాణికులు ఎట్టకేలకు సేఫ్‌గా తిరిగొచ్చారు. అధికారుల ప్రయత్నాలతో చివరికి వారంతా సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. బుధవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా విమానం వారిని ఢిల్లీకి తీసుకువచ్చింది. ఈ ప్రయాణికులతో పాటు 17 మంది సిబ్బందిని కూడా అదే విమానంలో భారత్‌కు తరలించారు. సాంకేతిక లోపం కారణంగా సోమవారం నాడు శాన్‌ఫ్రాన్సిస్కో–ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే మంగోలియా రాజధానికి మళ్లించబడింది. దీంతో ప్రయాణికులు రెండు రోజుల పాటు ఉలాన్‌బాతర్‌లో నిలిచిపోయారు. పరిస్థితి తెలుసుకున్న ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రయాణికులందరినీ సురక్షితంగా భారత్‌కు తరలించారు. అధికారులు ఈ ఘటనపై సాంకేతిక లోపం కారణాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Next Story






