- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగోలో ఎబోలా విజృంభణ..223 మంది మృతి
ఆఫ్రికాలో ఎబోలా మహమ్మారి ఆందోళన పెట్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరగటంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాంగోలా రెండు వారాల్లోనే 906 కేసులు నమోదు కాగా 223మంది మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: ఆఫ్రికాలో ఎబోలా మహమ్మారి ఆందోళన పెట్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరగటంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాంగోలా రెండు వారాల్లోనే 906 కేసులు నమోదు కాగా 223మంది మరణించారు. వ్యాధి సోకిన ప్రతి పదిమందిలో ఐదుగురు మరణిస్తున్నారు. ఎబోలా వైరస్ సోకినవారిలో బతిఏ అవకాశం 50 శాతం మాత్రమే ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. మరోవైపు కాంగో సరిహద్దు దేశం ఉగాండాలో కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎబోలా వ్యాప్తితో పొరుగుదేశాలు హైఅలర్ట్ ప్రకటించాయి.
ఎబోలా చికిత్సలో ప్రస్తుతం మూడు రకాల మందులను వినియోగిస్తున్నారు. మహమ్మారి చికిత్సపై క్లినికల్ ట్రయల్స్ సైతం నిర్వహిస్తున్నారు. ట్రయల్స్ పూర్తయ్యాక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ ఓ చెబుతోంది. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం అఫ్రికా దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు అఫ్రికా నుండి ఇతర దేశాలకు వెళుతున్న వారికి సైతం లక్షణాలు ఉండటం ఆందోళనకరంగా మారింది. దీంతో అలా వెళుతున్నవారిని క్వారంటైన్ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు.






