- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. 22 మంది సైనికులు మృతి?
ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా 22 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన... అక్కడి రెబల్ గ్రూప్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Balochistan Liberation Army)... రోజు రోజుకు రెచ్చిపోతోంది. ఇండియా తో యుద్ధం బిజీలో పాకిస్తాన్ ఉంటే... వెనుక నుంచి.. వెన్నుపోటు పొడుస్తోంది బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.
ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, జనాలను కూడా చంపేసింది. అయితే తాజాగా మరో 22 మంది పాకిస్తాన్ సైనికులను... చంపేసింది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. తుర్భజ్, డుక్కీలో ఆర్మీ కాన్వాయిలపై అటాక్ చేసి... 22 మందిని హత మార్చింది.
ఈ దాడులలో మొత్తం 22 మంది పాకిస్తాన్ సైనికులు ( pakisthan army) మృతి చెందడంతో పాటు... చాలా మంది గాయాల పాలు అయ్యారు. అలాగే బలిచిస్తాన్ లైబ్రేషన్ ఆర్మీ ఫైటర్స్...కూడా ఆరు మంది మరణించారు. మరో ప్రాంతంలో ఈ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లోని కొన్ని పట్టణాలపై బలిజిస్తాన్ పట్టు సాధించినట్లు తెలుస్తోంది.






