- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బార్డర్‌లో కలకలం.. పాక్ రేంజర్‌ను పట్టుకున్న జవాన్లు
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ బార్డర్ వద్ద కలకలం చోటు చేసుకుంది. భారత్‌లోకి ఓ పాకిస్థాన్ రేంజర్ చొరబడగా అతడిని బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ బార్డర్ వద్ద కలకలం చోటు చేసుకుంది. భారత్‌లోకి ఓ పాకిస్థాన్ రేంజర్ చొరబడగా అతడిని బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తరవాత ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కశ్మీర్‌లో పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వాటిని భారత సైన్యం సమర్దవంతంగా తిప్పికొడుతోంది. కేవలం కశ్మీర్‌లోనే కాకుండా దేశ సరిహద్దుల్లోని ఆర్మీ అప్రమత్తం అయింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో ఏమైనా జరగవచ్చు అని భారత జవాన్లు అలర్ట్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లోని గంగానగర్ బార్డర్ వద్ద నియంత్రణ గీత దాటిన రేంజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేంజర్ ఎందుకు భారత్‌లోకి ప్రవేశించాడు అనే విషయాలు విచారణలో తేలనున్నాయి.






