భారీ భూకంపానికి నేలమట్టం అయిన భవనాలు.. 22 మంది మృతి

by Malleboina Mahesh |

ఫిలిప్పీన్స్‌లో ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దానీ తీవ్ర 6.9 నమోదైంది. ఇది సెబు ద్వీపం వద్ద కేంద్రంగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

భారీ భూకంపానికి నేలమట్టం అయిన భవనాలు.. 22 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లో ఉదయం భారీ భూకంపం (huge earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దానీ తీవ్ర 6.9 నమోదైంది. ఇది సెబు ద్వీపం వద్ద కేంద్రంగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. 6.9 తీవ్రతతో భూకంపం కారణంగా భారీ ఎత్తున ప్రకంపనలు సంభవించాయి. దీంతో క్షణాల్లోనే అనేక ఇళ్లు, ఆఫీసులు నేలమట్టం అయ్యాయి. ఈ షాకింగ్ ఘటనలో కనీసం 22 మంది మృతి (22 people died) చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంపం ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగిసి పడటంతో అధికారులు వెంటనే హై అలర్ట్ (High alert) ప్రకటించారు.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, భూకంపం శక్తివంతంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లకు పరుగులు తీశారు. అనేక ప్రాంతాల్లో రహదారులు పగుళ్లు పడటంతో రవాణా అంతరాయం ఏర్పడింది. రక్షణ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నాయి. అధికారులు ప్రభావిత ప్రాంతాల ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story