- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19 ఏళ్లకే ఆల్జీమర్స్ వ్యాధి.. చైనా టీనేజర్‌లో నిర్ధారించిన వైద్యులు
by Malleboina Mahesh |
చైనా టీనేజ్ వ్యక్తిలో ఆల్జీమర్స్ కలకలం రేపింది. డ్రాగన్ దేశంలో 19 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధిని నిర్ధారించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

X
బీజింగ్: చైనా టీనేజ్ వ్యక్తిలో ఆల్జీమర్స్ కలకలం రేపింది. డ్రాగన్ దేశంలో 19 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధిని నిర్ధారించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ జువాన్ వు హాస్పిటల్ రీసెర్చర్స్ ప్రకారం ఈ యువకుడి జ్ఞాపకశక్తి రెండేళ్లలో వేగంగా క్షీణించినట్లు తెలిపారు. ఇటీవల సంఘటనలు, వస్తువలు స్థానాలను గుర్తించలేని స్థితికి చేరుకున్నట్లు చెప్పారు.
అయితే ఇది వ్యాధి ప్రారంభ సంకేతమని అన్నారు. కాగా, దీని కారణంగానే స్కూల్ జీవితాన్ని త్వరగా వదిలేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. అయితే ఈ పరిశోధన భవిష్యతులో ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడంలో సహాయపడుతుందని తెలిపింది. జన్యు సంబంధిత లక్షణాలు లేకుండా చూసుకుంటే అతిచిన్న వయసులో గుర్తించిన అల్జీమర్స్ కేసు ఇదే కావడం గమనార్హం.
- Tags
- china
- Alzheimer's
Next Story






