- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది స్పాట్ డెడ్
by Naga Rani Yarlagadda |
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. అక్కడి కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 7.45 గంటల సమయంలో మిలిటరీ యుద్ధసామాగ్రి ప్లాంట్లో ఈ పేలుడు జరిగింది. పేలుడు పదార్థాల తయారీ, డెవలప్మెంట్ జరిగే అక్యూరేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ కర్మాగారంలో పేలుడు జరిగింది. ప్రమాదంలో 19 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. వారంతా స్పాట్లోనే మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కార్లు ఎగిరిపడగా.. వాటికి మంటలంటుకుని దగ్ధమయ్యాయి. సమీపంలో ఉన్న ఇళ్లు, పార్క్ చేసి ఉన్న వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా కంపించాయి. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. FBI అక్కడ ఆధారాలను సేకరించి.. దర్యాప్తు చేపట్టింది.
Next Story






