Amazon : ఏఐ ఎఫెక్ట్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోత

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-28 14:52:29  IST  )

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగాల కోత విధించింది. 2025 చివరినాటికి దాదాపు 14వేల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా మరో 16వేల ఉద్యోగులకు కోత పెట్టింది.

Amazon : ఏఐ ఎఫెక్ట్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగాల కోత విధించింది. 2025 చివరినాటికి దాదాపు 14వేల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా మరో 16వేల ఉద్యోగులకు కోత పెట్టింది. కరోనా సమయంలో తీసుకున్న ఉద్యోగులను తొలగించడంతో పాటు ఏఐపై ఆధారపడాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు తొల‌గించ‌డంపై అమెజాన్ చీఫ్ పీపుల్ ఆఫీస‌ర్ బెత్ గ‌లెట్టి కంపెనీ బ్లాగ్ లో అధికారికంగా ప్ర‌క‌టించారు. నిర్వ‌హ‌ణ స్థాయిని త‌గ్గించ‌డం, బ్యూరోక్ర‌సీని త‌గ్గించ‌డం ల‌క్ష్యంగా విస్తృత సంస్థాగ‌త మార్పుల‌లో ఈ తొల‌గింపులు కూడా భాగం అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇచ్చిన ప్రాజెక్టులు స‌రైన స‌మ‌యంలో పూర్తి చేయ‌క‌పోవ‌డం కూడా ఇందుకు కార‌ణం అని తెలిపారు. తొల‌గించిన ఉద్యోగాల‌లో టెక్నాల‌జీ, రిటైల్, క్లౌడ్ స‌ర్వీసెస్, మీడియా మ‌రియు ఇత‌ర అంత‌ర్గంగా ప‌నిచేసే విభాగాలు ఉన్నాయి. ఇక ఒకేసారి 16వేల ఉద్యోగాల కోత‌తో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో మ‌ళ్లీ ఆందోళ‌న మొద‌లైంది.

Next Story