- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 ఏళ్ల తర్వాత వికసించిన 150 కేజీల అరుదైన పుష్పం.. కంపుకొట్టే దాని ప్రత్యేకతలే వేరు
సాధారణంగా పువ్వులంటే అందంగా సువాసన వెదజల్లుతుంటాయని మనందరికి తెలుసు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పువ్వులంటే అందంగా సువాసన వెదజల్లుతుంటాయని మనందరికి తెలుసు. కానీ, కార్ప్స్ ఫ్లవర్(Corpse Flower) మాత్రం అత్యంత భారీ ఆకారంతో చూసేందుకు అందంగా కనిపిస్తూ.. ముక్కుపుటాలు అదిరిపోయేలాగా కంపుకోడుతుంది. ఆస్ట్రేలియా(Australia)లోని సిడ్నీలో 15 ఏళ్ల తర్వాత వికసించిన ఈ అరుదైన పుష్పం విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కార్ప్స్ ఫ్లవర్.. 1878లో ఇండోనేషియాలోని సుమత్రా వర్షారణ్యాలలో తొలిసారి ఇటలీకి చెందిన బొటానిస్ట్ ఓడోర్డో బెక్కారీ దీనిని గుర్తించారు. అక్కడ దీనిని బుంగా బంగ్కై అని పిలుస్తారు. ఈ పువ్వు శాస్త్రీయ నామం అమోర్ఫోఫాల్లస్ టైటానియం(Amorphophallus titanum). కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది వికసిస్తుంది. 3 మీటర్లు పొడవు వరకు పెరుగుతుంది. 150 కేజీల వరకు బరువు ఉంటుంది. స్పాడిక్స్ దిగువన వందల కొద్దీ చిన్న పువ్వులు ఉంటాయి. ఇది వికసించిన తర్వాత 24 గంటలు మాత్రమే తాజాగా ఉంటుంది. ఈ పువ్వు వికసించినప్పుడు పొడవైన స్పాడిక్స్ నుంచి కుళ్లిన మాంసం వంటి వాసనను వెదజల్లుతుంది. ఇది మాంసాహారమని భావించి కీటకాలు దానిపైకి వస్తుంటాయి. కాబట్టి అవి మగ, ఆడ పువ్వుల మధ్య పుప్పొడిని వ్యాప్తి చేయడంలో సహాయపడతాయి.
సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లో ఉన్న అనేక టైటాన్ ఆర్మ్‌లలో ఇది కూడా ఒకటి. ఇక్కడ 15 సంవత్సరాల క్రితం ఈ పువ్వు చివరిగా వికసించింది. కార్ప్స్ ఫ్లవర్ విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ అరుదుగా వికసిస్తుండటంతో సందర్శకులు పుష్పాన్ని చూసేందుకు భారీగా తరలివెళ్తున్నారు. ప్రస్తుతం ఈ మొక్కను అరుదైన, అంతరించిపోయే మొక్కల లిస్టులో చేర్చారు. ఈ పువ్వుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






