వామ్మో.. పావు కిలో ఉప్పు రూ.7500.. ఎందుకంతా కాస్ట్లీ గురూ!

by Yella Dhawani Reddy |

వంట పదార్థాల్లో ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వామ్మో.. పావు కిలో ఉప్పు రూ.7500.. ఎందుకంతా కాస్ట్లీ గురూ!
X

దిశ, వెబ్ డెస్క్: వంట పదార్థాల్లో ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఉప్పు వేయకుండా వంట పూర్తి కాదు. అందుకే ఉప్పు.. 'అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుంది' అని నానుడీ. ఇక ఉప్పు ధర కూడా చాలా చవక. కిలో రూ.10 నుంచి రూ.20, 30కి మించదు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఉప్పు ధర తెలిస్లే షాక్ అవుతారు. కేవలం పావు కిలో ఉప్పుకు ఏకంగా రూ.7500. ప్రపంచంలోనే కాస్ట్లీ ఉప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వంటకు రుచిని అందించే ఉప్పులోనూ.. పింక్‌ సాల్ట్‌, రాక్‌ సాల్ట్‌, బ్లాక్‌ సాల్ట్‌ ఇలా రకరకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఉప్పు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పుగా పేరుగాంచింది. ఒక గ్రాము కొనాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అదే కొరియన్‌ వెదురు ఉప్పు. 250 గ్రాముల కొరియన్‌ వెదురు ఉప్పు ధర ఏకంగా రూ.7,500(100 డాలర్లు). ఎందుకు ఇంతా ధర అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే దీన్ని అన్ని ఉప్పుల్లా కాకుండా చాలా ప్రత్యేక పద్ధతుల్లో కొరియన్ వెదురులలో తయారు చేస్తారట. అందుకే దీనికి అంత ధర ఉంటుంది. ఇక దీన్ని కొరియన్ బాంబూ ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు, జుగ్యోమ్ అని కూడా అంటారు.

కొరియన్ వెదురు ఉప్పు ఎలా తయారు చేస్తారు?

ముందుగా సముద్రం ఉప్పును వెదురు బొంగులలో వేసి, వాటిని బంకమట్టితో మూసివేస్తారు. ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. 800°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉప్పును 9 సార్లు కాల్చి, చివరిగా 1,000°C వద్ద రోస్టింగ్‌ చేస్తారు. ఇందుకు దాదాపుగా 50 రోజుల సమయం పడుతుంది. ఉప్పును వేయించిన ప్రతిసారీ, వెదురు లక్షణాలు, అనేక ఖనిజాలు ఉప్పులోకి చేరుతాయట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా సార్లు వేడి చేయడంతోపాటు, దీని తయారీకి ప్రత్యేక ఫర్నేసులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం. ఎందుకంటే దీనికి చాలా శ్రద్ధ ,అనుభవం కావాలి. అందుకే ఈ ఉప్పు ధర అంత కాస్ట్లీ.

కొరియన్ వెదురు ఉప్పు ప్రయోజనాలు

ఇక సాధారణ ఉప్పుతో పోల్చితే ఈ ఉప్పుతో ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొరియన్లు పురాతన కాలం నుంచి వంటలలో, సాంప్రదాయ కొరియన్ వైద్యంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం మెగ్నీషియంతో సహా 70కి పైగా అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మంటను తగ్గిస్తుంది, కీళ్లనొప్పులు, గొంతు నొప్పికి ఉపశమనంగా పనిచేస్తుంది. నోటి పూత, చిగుళ్ల వాపు వంటి నోటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇక దీని తర్వాత ప్రపంచంలో 'ఐస్లాండిక్ ఉప్పు' ఖరీదైన ఉప్పుగా ఉంది. దీన్ని 'లగ్జరీ సాల్ట్' అని కూడా పిలుస్తారు. ఇది ఐస్‌లాండ్‌లోని వాయువ్య ప్రాంతాలలో చేతితో తయారు చేస్తారు.

Next Story