విమానం ల్యాండింగ్ గేర్‌లో ఎక్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీ వచ్చిన 13 ఏళ్ల బాలుడు

by Malleboina Mahesh |

ఢిల్లీలోని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది.

విమానం ల్యాండింగ్ గేర్‌లో ఎక్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీ వచ్చిన 13 ఏళ్ల బాలుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport)లో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) నుంచి వచ్చిన Kam Air విమానం (ఫ్లైట్ RQ-4401)ల్యాండింగ్ గేర్ వీల్ బాక్సు (Landing gear wheel box)లో ఓ 13 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అత్యవసర సిబ్బంది గుర్తించారు. వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అతన్ని అదుపులోకి తీసుకుని విచారించింది.13 ఏళ్ల బాలుడు కేవలం తనకు ఆసక్తి కారణంగా విమానాశ్రయంలో నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లి, ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్నానని తెలిపాడు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఈ ఘటన విమాన సేఫ్టీ (Flight safety)పై ఆందోళనలు రేపగా, అధికారులు వెంటనే ఆ ఫ్లైట్‌పై యాంటీ-సాబోటేజ్ తనిఖీలు (Anti-sabotage checks) నిర్వహించారు. సాధారణంగా ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌ (Landing gear compartment)లో ప్రయాణించడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే అక్కడ తగినంత ఆక్సిజన్ ఉండదు. అలాగే విమానం గాలిలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన చలిని తట్టుకోవడం అసాధ్యం. అలాగే మెకానికల్ భాగాల వల్ల గాయపడే అవకాశమూ ఉంది. అదృష్టవశాత్తూ ఈ బాలుడు బతికి బయటపడ్డాడు. అనంతరం అధికారుల పర్యవేక్షణలో అతన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌కు పంపారు. ఈ సంఘటన భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చి, ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story