SUV కార్ల‌తో ఎంట్రీ..టోల్ గేట్ సిబ్బందిపై 15 మంది దాడి...షాకింగ్ వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

హర్యానాలో టోల్ గేట్ దగ్గర దాదాపు 15 మంది రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఖరీదైన SUV కార్లలో వ‌చ్చి, మ‌రీ దాడుల‌కు తెగ‌ప‌డ్డారు.

SUV కార్ల‌తో ఎంట్రీ..టోల్ గేట్ సిబ్బందిపై 15 మంది దాడి...షాకింగ్ వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్‌: హైవేలపై టోల్ గేట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోల్ గేట్ల దగ్గర దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. టోల్ గేట్ల సిబ్బందిని టార్గెట్ చేసి కొంత మంది దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. రూల్స్ ప్రకారం టోల్ గేట్ల ద్వారా వెళ్తే టోల్ ఫీజు చెల్లించాల్సిందే. ఫోర్ వీలర్ నుంచి మొద‌లుకొని ప్రతి వెహికల్ టోల్ ఫీజు కట్టాల్సిందే. అయితే కొంత మంది ఆ టోల్ ఫీజు అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. కొంత మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, ప్రమాదాలకు కారణమవుతున్నారు.

టోల్ గేట్ సిబ్బంది పై 15 మంది రౌడీ మూకల దాడి

మరి కొంత మంది టోల్ గేట్ సిబ్బంది పైన దాడులు చేసి వైరల్ అవుతున్నారు. తాజాగా హర్యానాలో టోల్ గేట్ దగ్గర దాదాపు 15 మంది రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఖరీదైన SUV కార్లలో వ‌చ్చి, మ‌రీ దాడుల‌కు తెగ‌ప‌డ్డారు. హర్యానా రాష్ట్రంలోని సోనీ జిల్లా పరిధిలో ఉన్న బిగాన్ టోల్ ప్లాజా దగ్గర టోల్ సిబ్బందిపై దారుణంగా దాడి చేశారు ఈ 15 మంది రౌడీలు. దాదాపు మూడు కార్లలో వచ్చిన ఈ కిరాతకులు, టోల్ ఫీజు అడిగినందుకు దాడి చేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ 15 మంది చేతులలో గాయపడిన టోల్ ప్లాజా ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయిన విజువల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 3వ తేదీన పానిపట్ సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్ద, ఫీజు అడిగినందుకు ఇలాంటి సంఘటనే జరిగిందట. ఓ వ్య‌క్తి పిస్ట‌ల్ కూడా చూపించాడని అంటున్నారు.

Next Story