North Sikkim floods: ఉత్తర సిక్కింలో చిక్కుకున్న 100 మంది పర్యాటకులు సేఫ్

by Shamantha N |   (  Updated:2025-06-02 09:24:43  IST  )

మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వేల మంది పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలోని లాచుంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన 100 మందిని మొదటి విడతగా 18 వెహికల్స్ లో సోమవారం ఫిడాంగ్ ప్రాంతానికి అధికారులు తరలించారు. మంగన్ జిల్లా కలెక్టర్ అనంత్ జైన్ స్వయంగా ఈ సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

North Sikkim floods: ఉత్తర సిక్కింలో చిక్కుకున్న 100 మంది పర్యాటకులు సేఫ్
X

దిశ, నేషనల్ డెస్క్: మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వేల మంది పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలోని లాచుంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన 100 మందిని మొదటి విడతగా 18 వెహికల్స్ లో సోమవారం ఫిడాంగ్ ప్రాంతానికి అధికారులు తరలించారు. మంగన్ జిల్లా కలెక్టర్ అనంత్ జైన్ స్వయంగా ఈ సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఫిడాంగ్ నుంచి టూరిస్టులు సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ కు చేరుకుంటారు. లాచుంగ్ ప్రాంతంలో వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక పోలీసులు, ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), అటవీ శాఖ, లాచుంగ్ , డ్రైవర్స్ అసోసియేషన్లు, ఇతర పర్యాటక సంఘాలు, స్థానిక ప్రజలు సమన్వయంతో టూరిస్టులను సేఫ్ గా సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. మరో 284 వెహికల్స్ ను ఏర్పాటు చేశామని, మొత్తం 1678 మంది పర్యాటకులను ఫిడాంగ్ కు తీసుకురానున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. లాచుంగ్ ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీని కూడా పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రహదారి తిరిగి అందుబాటులోకి వచ్చిన వెంటనే అక్కడ చిక్కుకున్న పర్యాటకులను తరలిస్తామని కలెక్టర్ జైన్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు 34 మంది మృతి

మే 30న ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టి వర్షానికి ఉత్తర సిక్కింలో భారీగా వరదలు వచ్చాయి. మంగన్ జిల్లాలోని రెండు వంతెనలు దెబ్బతిన్నాయి. సిక్కిం డీజీపీ అక్షయ్ సచదేవ లాచుంగ్‌ నుంచి సురక్షితంగా తరలించిన పర్యాటకులకు ఫిడాంగ్ లో స్వాగతం పలికారు. మూడు రోజులుగా అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు వల్ల కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు.బాధితులకు సహాయం అందించేందుకు చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కూడా రంగంలోకి దిగింది. హెలిక్యాప్టర్లు, పడవల్లో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Next Story