గర్గుల్ గ్రామంలో రెండు మహిళా సంఘ భవనాలకు భూమి పూజ

by Jakkula.Mamatha |

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో రెండు మహిళా సంఘ భవనాలకు సర్పంచ్ దివ్య రవితేజ సోమవారం భూమి పూజ నిర్వహించారు.

గర్గుల్ గ్రామంలో  రెండు మహిళా సంఘ భవనాలకు భూమి పూజ
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో రెండు మహిళా సంఘ భవనాలకు సర్పంచ్ దివ్య రవితేజ సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళా సంఘ సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవాలంటే ఇబ్బందిగా ఉండేదని అన్నారు. కిరాయి ఇళ్లలో ఇరుకిరుకుగా ఇబ్బందికరంగా ఉండేదని పేర్కొన్నారు. రెండు సంఘ భవనాలు మంజూరు కావడంతో గ్రామ మహిళా సంఘం సభ్యుల ఇబ్బంది తొలగనుందని తెలిపారు. దీంతో గ్రామ మహిళా సంఘ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రవీణ్, ఎల్లవ్వ లింబవ్వ, స్వామి, శ్రీనివాస్, శ్యామ్ కిషోర్, రాజేష్ గ్రామ నాయకులు బి.శంకర్, గౌడ్, నరసింహులు, శ్యాం ప్రకాష్, అశోక్ రెడ్డి, ఏసు స్వామి, గోవర్ధన్ నిస్సి సిద్ధిరాములు బచ్చు గంగారాం స్వామి గంగారెడ్డి హారిక రూప భూదేవి ఉమారాణి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Next Story