- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోహన్ బాబుకి అసలైన టైం స్టార్ట్ అయింది.. ఇప్పుడు కొడితే తిరుగు లేనట్లే
'శ్రీనివాస మంగాపురం', 'ది ప్యారడైజ్' చిత్రాలు మోహన్ బాబు కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే, ఆ తర్వాత హీరోగా చేసిన పలుచిత్రాలు ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో ఆయన క్రేజ్ క్రమంగా తగ్గింది. మధ్యలో యమదొంగ, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.
ప్రస్తుతం మోహన్ బాబు మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో మోహన్ బాబు లుక్, పాత్రకు మంచి స్పందన లభించింది. సినిమా విజయవంతమై, ఆయన పాత్ర ఆకట్టుకుంటే కెరీర్‌కు ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ప్రస్తుతం నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో కూడా మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కూడా విజయాన్ని సాధించి, మోహన్ బాబు పాత్రకు మంచి గుర్తింపు దక్కితే ఆయనకు మరోసారి వరుస అవకాశాలు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో మోహన్ బాబు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.






