బహదూర్ గూడ భూములపై లంచ్ మోషన్ పిటిషన్.. కాసేపట్లో హైకోర్టులో విచారణ!

by Kema Shiva Kumar |

బహదూర్ గూడ భూసేకరణ వివాదంపై హైకోర్టులో అనూహ్యంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

బహదూర్ గూడ భూములపై లంచ్ మోషన్ పిటిషన్.. కాసేపట్లో హైకోర్టులో విచారణ!
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని బహదూర్ గూడ గ్రామంలో 650 ఎకరాల భూసేకరణ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ, హైడ్రా (HYDRAA) అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ, బాధితులైన రైతులు హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు.

పోలీస్ బందోబస్తు.. హైకోర్టు విచారణ..

అయితే, గత కొద్దిరోజులుగా బహదూర్ గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 650 ఎకరాల భూమిని ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అక్కడి రైతులు ఆందోళన బాట పట్టారు. ఇటీవలే అధికారులు సదరు ఫెన్సింగ్ వేసేందుకు రావడంతో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ, లాఠీఛార్జ్ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అర్ధరాత్రి వేళ రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించి, గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది.

Next Story