పెళ్లి చేసుకోకుండానే 100 మంది సంతానం.. అందరకీ సమానంగా ఆస్తి

by Shamantha N |

టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ ప్రపంచ వ్యాప్తంగా తన వీర్య దానంతో పుట్టిన 100 మంది పిల్లలకు తన ఆస్తి మొత్తం సమానంగా పంచుతానంటూ సంచలన ప్రకటన చేశారు.

పెళ్లి చేసుకోకుండానే 100 మంది సంతానం.. అందరకీ సమానంగా ఆస్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ ప్రపంచ వ్యాప్తంగా తన వీర్య దానంతో పుట్టిన 100 మంది పిల్లలకు తన ఆస్తి మొత్తం సమానంగా పంచుతానంటూ సంచలన ప్రకటన చేశారు. గతంలో తనకు పెళ్లి చేసుకోకున్నా 100 మంది పిల్లలు పుట్టారని తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఆయన తాజాగా అందరికీ సమానంగా ఆస్తి పంచిస్తానని చెప్పి షాక్ ఇచ్చారు. పావెల్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ముగ్గురితో సహ జీవనం చేస్తున్నారు. వారిలో ఒక్కొక్కరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి ఎంత ఆస్తి పంచుతానో మిగతా 100 మందికి కూడా తన ఆస్తిలో సమానమైన వాటా ఉంటుందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు.

15 ఏళ్ల పాటు వీర్యదానం

ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పావెల్ దీని గురించి ప్రస్తావించాడు. 12 దేశాల్లో 100 మంది పిల్లలు తన వీర్య దానంతో జన్మించినట్లు పేర్కొన్నాడు. 15 ఏళ్ల పాటు వీర్యదానం చేశానని చెప్పాడు. ఇటీవలే తన ఆస్తికి సంబంధించి పూర్తి వీలునామా రాసేశానని, అందులో తన 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో వాటా ఇచ్చేలా ఉందని పేర్కొన్నారు. కానీ వారు మరో 30 ఏళ్ల వరకు తన ఆస్తిలో వాటా రావాలంటే ఆగాల్సిందే అన్నారు. తనకు ఎక్కువ మంది శత్రువలని అందుకే ఇలా చేస్తున్నానని ప్రకటించారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోని టెలిగ్రామ్ సీఈవో ఇలాంటి ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలా చేయడానికి గతంలో తన ఫ్రెండ్ ఒకరు వీర్యదానం చేయాలని కోరగా మొదట్లో తాను నవ్వుకున్నానని, తర్వాత ఇదెంత పెద్ద సమస్యో తెలుసుకుని ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాల్లో వీర్య దానం చేశానని చెప్పుకొచ్చారు.

Next Story