ఆర్థిక వృద్ధికి ప్రపంచ బ్యాంక్ సలహా!

by  |
ఆర్థిక వృద్ధికి ప్రపంచ బ్యాంక్ సలహా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇదివరకే మందగమనంలో కొనసాగుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు కొవిడ్-19 మరింత తీవ్ర సంక్షోభాన్ని తెచ్చిపెట్టేలా ఉందని వరల్డ్ బ్యాంక్ అభిప్రాయపడింది. ఇటీవల ‘సౌత్ ఏషియా ఎకనామిక్ అప్‌డేట్: ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్-19’ పేరుతో నివేదిక విడుదల్ చేసింది. ఇందులో…2021 ఆర్థిక సంవత్సరానికి ఇండియా వృద్ధిరేటు 2.8 శాతానికి క్షీణిస్తుందని అంచనాను తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ మరింత కాలం కొనసాగితే ఇప్పుడున్న అంచనాలను దాటి మరింత దారుణంగా పరిస్థితులుండొచ్చని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా సేవారంగం తీవ్రమైన సంక్షోభాన్ని చూడనుందని, ఇక దేశీయంగా పెట్టుబడులకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రతికూల పరిస్థితులు అడ్డు పడనున్నాయని నివేదిక చెబుతోంది. ప్రభుత్వ తీసుకునే చర్యలను బట్టి 2022 ఏడాదికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 5 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని సౌత్ ఏషియా చీఫ్ ఎకనామిస్ట్ హాన్స్ టిమర్ చెప్పారు. ప్రధానంగా ప్రజలకు ఆహార కొరత రాకుండా జాగ్రత్త పడాలని, బ్యాంకులు దివాళాకు వెళ్లకుండా, ఉపాధి కోల్పోయిన వారికి స్థానికంగానే తాత్కాలికంగా పనులు కల్పించాలని నివేదిక సూచించింది.

Tags: Coronavirus Cases, Coronavirus Impact, Coronavirus Impact Indian Economy, world bank, covid-19

Next Story

Most Viewed