ఫుల్‌గా తాగేసి రోడ్డున్న పడ్డ చందు..సూసైడ్‌కు ముందు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Mamatha |
ఫుల్‌గా తాగేసి రోడ్డున్న పడ్డ చందు..సూసైడ్‌కు ముందు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ,వెబ్‌డెస్క్: బుల్లితెర నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వీడియో ఎదైనా ఉన్నదా అంటే పవిత్ర జయరాం, చందు మరణించడమే. త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్రా జయరామ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చంద్రకాంత్ మరణంతో ఆయన భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఆత్మహత్య చేసుకుంటారని అసలు ఊహించలేదని శిల్ప తెలిపారు. భర్త మరణంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అసలు ఏం జరిగిందో శిల్ప వివరించారు.

చందు గురించి శిల్స మాట్లాడుతూ..పవిత్ర మరణం తర్వాత చందు డిప్రెషన్‌లోకి వెళ్లాడు అని చెప్పింది. ఈ క్రమంలోనే చందు సోషల్ మీడియాలో పలు పోస్టులు చేశారు. ఏమని అంటే..‘‘రెండు రోజుల్లో వచ్చేస్తాను, వెయిట్ చెయ్’’ నాన్న అంటూ పోస్ట్ చేశారంట. అవి చూసిన శిల్పకి అతను ఏదో అఘాయిత్యానికి పాల్పడతారని సందేహం కలిగిందని చెప్పింది. దీంతో శిల్ప తన భర్తతో జరిగిందో ఏదో జరిగిందో వదిలేసేయ్..నీ పిల్లల కోసం అయినా నువు ఆలోచించు అంటూ చెప్పింది అంట. అప్పుడు చందు 'నేను చాలా ధైర్యంగా ఉంటాను. నేను ఏమీ చావను. నేను పిల్లలను చూసుకోవాలి' అన్నాడు అని చెప్పుకోచ్చింది. కానీ ఇంతలోనే ఇలా చేస్తాడని అసలు ఊహించలేదని కన్నీరు పర్యంతం అయ్యారు. ఆత్మహత్యకు ముందు రోజు ఫుల్లుగా తాగి రోడ్డు మీద పడిపోతే స్నేహితులే వాళ్లింటికి తీసుకెళ్లారు అని చెప్పింది.

ఈ క్రమంలో ఫ్రెండ్స్ ఏంటి చందు ఇలా చెస్తున్నవ్ అని అడిగితే కూడా తాను ఏం చేసుకోనని, చావనని, ధైర్యంగా ఉంటానని చందు చెప్పాడు అని వివరించింది. ఈ విధంగా చెప్పిన 24 గంటల్లో ఇలా జరిగిందని చెప్పి బాధపడింది. ''నేను చందు స్నేహితుడి ఇంటికి వెళ్లి ఆయన్ను చూసి వచ్చాను. సేఫ్‌గా ఉన్నాడు అనుకునే లోపే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. ఆయన నడుచుకుంటూ బయటకి వెళుతున్నాని చెప్పారు. నాతో మాట్లాడటం లేదని ఆడపడుచు స్రవంతికి ఫోన్ చేశా. ఆయనకు ఫోన్ చేసి ఎక్కడికి వెళుతున్నారో కనుక్కోమని చెప్పిందంట. అప్పుడు చందు పవిత్ర పిల్లలకు ఇన్సూరెన్స్ వస్తుందని, అందుకోసం లక్డీకాపూల్ వెళుతున్నాని చెప్పారు. ఆ తర్వాత ఎంత మంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిసింది. తెలిసిన అబ్బాయిని అడిగితే పవిత్ర ఫ్లాటుకు వెళ్లి చూశాడు. ఏడు గంటల సమయంలో మాకు విషయం తెలిసింది'' అని చెప్పారు.

Next Story

Most Viewed