సూర్య ‘కంగువ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పుడే!

by sudharani |
సూర్య ‘కంగువ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పుడే!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

అంతే కాకుండా ఇప్పటికే విలన్ బాడీ డియోల్‌కు సంబంధించిన క్లిప్స్, అలాగే మూవీ నుంచి లీక్ అయిన కొన్ని సీన్స్ అంతకంతకు ఈ సినిమాపై అంచాలు పెంచేస్తున్నాయి. దీంతో సినిమా ఎప్పుడు థియేటర్‌కు వస్తుందా అనే ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ డేట్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు.. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో కానీ నవంబర్ 1న కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. కాగా.. ‘కంగువ’లో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు.



Next Story

Most Viewed