- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
280 క్వింటాళ్ల రేషన్ బియ్యాం సీజ్
దిశ, జహీరాబాద్ : తెలంగాణ - కర్ణాటక ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద సరిహద్దు దాటుతున్న 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. బియ్యం తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని గోదాంకు తరలించి భద్రపరిచారు. నిందితుల్లో గుజరాత్ జామ్ నగర్ మయూర నగర్ నివాసి మకవన్ గిరిధర్ భాయి (44), ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా వత్తిచేరుకురి మండలం చామలముద్ది గ్రామానికి చెందిన ఎంఎస్ పద్మజ, రైస్ ట్రేడర్స్ యజమాని కమలపతి శ్రీనివాస్ ఉన్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. వివిధ రకాలైన 1120 ప్లాస్టిక్ బ్యాగుల్లో 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నట్లు నమ్మదగిన సమాచారంతో చిరాగపల్లి ఆర్టీఓ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద నిలిచివున్న టాటా లారీని తనిఖీ చేశారు. వాహనంలో ప్రభుత్వ రేషన్ బియ్యం దొంగతనంగా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని రేషన్ బియ్యం సీజ్ చేసిన అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులతో పాటు విజిలెన్స్ అండ్ ఇన్ఫోసిమెంట్, టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ఎం.రవి, ఎస్ఐ.నరేష్ తదితరులు ఉన్నారు.