పరిగడుపున తులసి నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?.. అవేంటంటే..!

by Kavitha |
పరిగడుపున తులసి నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?.. అవేంటంటే..!
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అందులో చూసుకుంటే తులసితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందులో ఖాళీ కడుపుతో తులసి నీళ్లను తాగితే ఇంకా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటి, జీర్ణ సంబంధిత సమస్యలు అన్నీ దూరం అవుతాయి. పరిగడుపున తాగితే కడుపును క్లీన్ చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్యను పూర్తిగా నయం చేస్తుంది.

* చర్మ ఆరోగ్యానికి తులసి నీళ్లు బాగా ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. దీంతో మన చర్మం ఎంతో కాంతివంతంగా పని చేస్తుంది.

*అలాగే శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయం చేస్తుంది. అందుకే దీన్ని దివ్య ఔషధంగా భావిస్తుంటారు. *ఇంకో విషయం ఏంటంటే తులసి నీళ్లను తాగడం వల్ల డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. అంటే కడుపులో ఏమైనా టాక్సిన్స్, క్రిములు ఉంటే బయటకు పంపించేస్తుంది తులసి వాటర్.

*ఇక మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే తులసి నీళ్లను తాగితే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను నిర్వహించేందుకు సాయం చేసి ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తుంది.

*అంతే కాకుండా బాడీలో కొవ్వులు కరిగేందుకు కూడా తులసి నీళ్లు బాగా పని చేస్తాయి. ఇందులో ప్రత్యేక ఎంజైమ్స్ ఉంటాయి. వాటి వల్ల బాడీలోని కొవ్వు పదార్థాలు తగ్గిపోతుంటాయి.

*అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మీరు ప్రతి రోజూ తులసిని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Next Story

Most Viewed