ఆయిల్ ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులు

15

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు చాంద్రాయణగుట్టలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీకి భారీగా నీరు చేరింది. దీంతో ఫ్యాక్టరీలో అక్కడ పనిచేసే కార్మికులు చిక్కుకున్నారు. సుమారు 100 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రంతా క్వార్టర్స్‎లో ఉన్న నీళ్లలోనే కార్మిక కుటుంబాలు, మహిళలు, చిన్నారులు ఉండిపోయారు.