షుగర్ ఫ్యాక్టరీలో కార్మికుడు మృతి

by Batti.Sumithra |

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోనీ షుగర్ ఫ్యాక్టరీ లో కార్మికుడు పెద్ద బోయిన నారాయణ (55 ) మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీలోని వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా పైపు నుంచి జారిపడి పడి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో నారాయణను కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిసింది. మృతుడు రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన వాసి గా [&hellip;]</p>

dead body
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోనీ షుగర్ ఫ్యాక్టరీ లో కార్మికుడు పెద్ద బోయిన నారాయణ (55 ) మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీలోని వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా పైపు నుంచి జారిపడి పడి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో నారాయణను కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిసింది. మృతుడు రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన వాసి గా గుర్తించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఫ్యాక్టరీ అధికారులను నిలదీశారు. బాధితులు ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీస్ లు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Next Story