- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్నెందుకు బ్రతికించారు.. నన్నూ వారివద్దకు పంపించేయండి
<p>దిశ,వెబ్ డెస్క్: భార్య భర్తల మనస్పర్దల కారణంతో ముగ్గురు పిల్లల గొంతునులిమి చంపి ,తానూ ఈగలందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సుబ్బ నరసమ్మ కళ్ళు తెరిచింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన ఆమె మనస్పర్థల కారణంగా శుక్రవారం తన ముగ్గురు పిల్లల్ని గొంతు నులిమి చంపి, అనంతరం ఆమె ఈగల మందు తాగింది. ముగ్గురు పిల్లలు మృతిచెందగా ..ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శనివారం కోలుకున్న ఆమె మాట్లాడుతూ తనను ఎందుకు బ్రతికించారని ఆసుపత్రి […]</p>

దిశ,వెబ్ డెస్క్: భార్య భర్తల మనస్పర్దల కారణంతో ముగ్గురు పిల్లల గొంతునులిమి చంపి ,తానూ ఈగలందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సుబ్బ నరసమ్మ కళ్ళు తెరిచింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన ఆమె మనస్పర్థల కారణంగా శుక్రవారం తన ముగ్గురు పిల్లల్ని గొంతు నులిమి చంపి, అనంతరం ఆమె ఈగల మందు తాగింది. ముగ్గురు పిల్లలు మృతిచెందగా ..ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
శనివారం కోలుకున్న ఆమె మాట్లాడుతూ తనను ఎందుకు బ్రతికించారని ఆసుపత్రి సిబ్బందిపై మండిపడింది. తనను తన పిల్లవద్దకు పంపించేయమని కన్నీటిపర్యంతమయ్యింది. తన భర్తతో ఏర్పడిన విబేధాల వలనే తన బిడ్డలను గొంతు నులిమి చంపేసి తానూ చనిపోవాలని అనుకున్నానని, కానీ ఇప్పుడు తన పిల్లలు లేకుండా ఉండలేనని ఆవేదన చెందింది.ఇకపోతే పసికందుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు మృతదేహాలను బందువులకు అప్పగించారు.






