- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెల్లంపల్లిలో విషాదం.. చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య
<p>దిశ, బెల్లంపల్లి : పోచమ్మ చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీకి చెందిన పసునూరి స్వప్న కుమారి (41)కి కొంతకాలం కిందట భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లితో కలిసి నివసిస్తోంది. జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన ఆమె కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నది. గత వారం రోజుల కిందట బెల్లంపల్లికి విచ్చేసిన ఆమె మేనత్త దినకర్మకు హాజరై గురువారం […]</p>

దిశ, బెల్లంపల్లి : పోచమ్మ చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీకి చెందిన పసునూరి స్వప్న కుమారి (41)కి కొంతకాలం కిందట భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లితో కలిసి నివసిస్తోంది. జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన ఆమె కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నది.
గత వారం రోజుల కిందట బెల్లంపల్లికి విచ్చేసిన ఆమె మేనత్త దినకర్మకు హాజరై గురువారం ఇంటికి వెళ్తానని చెప్పి మధ్యాహ్నం సమయంలో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. జీవితం మీద విరక్తి చెందడమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మృతురాలి అన్న అనిల్ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ రాములు, విఠల్ గజ ఈత గాళ్ళ సాయంతో మృతదేహాన్ని గాలించగా సాయంకాలం 7:30 గంటలకు మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






