- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. భర్తే హంతకుడు..?
<p>దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి శివారులోని దేవివిహార్ కాలనీకి చెందిన శిరీష (32) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, అత్తింటివారి వేధింపుల వల్లే శిరీష మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తు్న్నారు. తమ కూతురిని అత్తింటి వారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అల్లుడు హరి ప్రసాదే నిందితుడు అని బాధిత పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో శిరీష ఉద్యోగం చేస్తుందని.. […]</p>

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి శివారులోని దేవివిహార్ కాలనీకి చెందిన శిరీష (32) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, అత్తింటివారి వేధింపుల వల్లే శిరీష మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తు్న్నారు. తమ కూతురిని అత్తింటి వారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అల్లుడు హరి ప్రసాదే నిందితుడు అని బాధిత పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో శిరీష ఉద్యోగం చేస్తుందని.. గత కొన్ని రోజులుగా శిరీష వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తుందని వివరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు హరిప్రసాద్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. శిరీష కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.






