- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలు ఎవరి మీద ఆధారపడొద్దు: జయసుధ
<p>దిశ, న్యూస్ బ్యూరో : మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని, ఎవరి మీద ఆధార పడకూడదని ప్రముఖ సినీనటి జయసుధ అన్నారు. తన 45 ఏళ్ల సినీ కెరీర్ లో తాను ఎన్నో ఒడిదొడుకులెదుర్కొన్నానని ఆమె చెప్పారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. సీఆర్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని ప్రశంసించారు. ఈ సందర్భంగా పద్మభూషన్ అవార్డుకు […]</p>

దిశ, న్యూస్ బ్యూరో : మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని, ఎవరి మీద ఆధార పడకూడదని ప్రముఖ సినీనటి జయసుధ అన్నారు. తన 45 ఏళ్ల సినీ కెరీర్ లో తాను ఎన్నో ఒడిదొడుకులెదుర్కొన్నానని ఆమె చెప్పారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. సీఆర్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని ప్రశంసించారు. ఈ సందర్భంగా పద్మభూషన్ అవార్డుకు సమానమైన డిఫెన్స్ తయారీ రంగంలో ఆయుధ భూషన్ అవార్డు పొందిన శ్రీమతి గోగినేని సుజాతను సీఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. రక్షణ రంగంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించి ఆయుధ భూషన్ అవార్డును ఎలా సాధించగలిగాననే విషయాన్ని ఈ సందర్భంగా గోగినేని సుజాత వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ సభ్యులు పి. వనశ్రీ, ప్రేమపావని, డా.కె.రజని పలువురు మహిళలు పాల్గొన్నారు.
Tags: jayasudha, cr foundation, women’s day celebration, gogineni sujatha






