- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళపై సామూహిక అత్యాచారం
<p>దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను వీడియో తీయడమే కాక, సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. బీహార్‌లోని మధుబనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. వీడియోలో కనిపించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానిక మధుబని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు అదే ప్రాంతంలో నివసిస్తున్న భర్త వదిలేసిన […]</p>
దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను వీడియో తీయడమే కాక, సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. బీహార్‌లోని మధుబనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. వీడియోలో కనిపించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
స్థానిక మధుబని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు అదే ప్రాంతంలో నివసిస్తున్న భర్త వదిలేసిన ఓ మహిళపై అత్యాచారం చేశారు. ముందుగా వీరిలో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు. దీంతో ఆమె అతడి ప్రేమకు సరే అన్నది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈక్రమంలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే అప్పటికే తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు. చివరకు పోలీసులకు విషయం తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






