ఇక నుంచి ఆ రాష్ట్రంలో మహిళా పూజారులు కూడా..

by  |
temples
X

దిశ,వెబ్‌డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తమిళనాడులో పూజారులుగా పురుషులే కొనసాగారు ఇప్పటి నుంచి ఆలయాల్లో మహిళ పూజరులను నియమించాలని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు పిలుపునిచ్చారు.

అర్హతను బట్టి దేవాలయాల్లో మహిళ అర్చకులను నియమించడం జరగుతుందన్నారు. అన్ని దేవాలయాల్లో తమిళంలోభాషలోనే అర్చనలు జరగాలని పేర్కొన్నారు. అదే విధంగా అర్చకత్వంలో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. 100 రోజుల వ్యవధిలోనే మహిళ అర్చకులను నియమించడానికి మార్గదర్శకాలు విడదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు దేవాలయాల్లో మహిళలు అర్చనలు చేస్తూ, పూజారులుగా కొనసాగుతున్నారని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed