- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ దారుణ హత్య.. నగలు చోరీ!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు ఎలాగోలా డబ్బులు చోరీకి పాల్పడి తప్పించుకునే తిరిగే వీరు ఈ మధ్యకాలంలో హత్యలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. సాంకేతికత అందుబాటులోకి రావడం, పోలీసుల నిఘా మరింత పటిష్టం కావడంతో ఎలాగైనా సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రాంనగర్ కాలనీలో దొంగలు దారుణానికి ఒడిగట్టారు. మహిళ ఒంటిపై ఉన్న నగలు చోరీకి యత్నించగా ఆమె […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు ఎలాగోలా డబ్బులు చోరీకి పాల్పడి తప్పించుకునే తిరిగే వీరు ఈ మధ్యకాలంలో హత్యలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. సాంకేతికత అందుబాటులోకి రావడం, పోలీసుల నిఘా మరింత పటిష్టం కావడంతో ఎలాగైనా సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రాంనగర్ కాలనీలో దొంగలు దారుణానికి ఒడిగట్టారు. మహిళ ఒంటిపై ఉన్న నగలు చోరీకి యత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమెను దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






