మరీ ఇంత కిరాతకమా.. వెండి గొలుసుల కోసం ఏకంగా మహిళ కాళ్లనే నరుక్కెళ్లారు..

by  |

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా దొంగలు ఎవరూ లేని సమయంలో ఇంట్లోని వెండి, బంగారు అభరణాలు, నగదును గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించుకు వెళ్లారని వార్తలు రావడం మనం వింటూనే ఉంటాం. మరికొందరు రద్దీ ఏరియాల్లో పర్సులు, బంగారు గొలుసులను మూడో కంటికి తెలియకుండా కొట్టేస్తుంటారు. కానీ, ఈ దొంగలు చేసిన దారుణం గురించి తెలిస్తే ఒక్కసారిగా ఒళ్లు జలదరించక మానదు. వెండి గొలుసుల కోసం ఏకంగా మహిళ రెండు కాళ్లను నరుక్కుని వెళ్లారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లా ఖతేపురా గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఖతేపురా గ్రామానికి చెందిన ఓ మహిళ (55) ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన దొంగలు ఆమె వెండి పట్టీలను దొంగిలించడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె.. దొంగలను ప్రతిఘటించేందుకు యత్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన దుండగులు వెండి పట్టీల కోసం ఏకంగా ఆ మహిళ రెండు కాళ్లను నరుక్కుని వెళ్లారు. దీంతో బాధిత కుటుంబీకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అంతేకాకుండా మృతురాలి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబం మరియు స్థానికులు నిరసన చేపట్టారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story