తమ్ముడి భార్యతో ఎఫైర్.. చివరికి..!

151

దిశ, వెబ్‎డెస్క్: వివాహేతర సంబంధం మోజులో పడి ఎంతో మంది వారి జీవితాలను నట్టేట ముంచుకుంటున్నారు. అలాంటి ఘటనే త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… త్రిపుర రాష్ట్రంలోని అగర్తల పరిధిలోని నాగ్పాడకు చెందిన ఉత్తమ్ దాస్ (45) తన అన్న తపన్ దాస్ (51) తో కలిసి నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ దాస్ భార్య రూపా దాస్‎తో తపన్‎కు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి అక్రమ సంబంధం ఉత్తమ్‎కు ఎక్కడ తెలుస్తోందో.. అని అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. దానికోసం రాజస్థాన్‎కు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్ రాకేష్ అనే వ్యక్తితో రూ.12.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.

పథకం ప్రకారం.. రాజస్థాన్‎కు పని నిమిత్తం ఉత్తమ్‎ను పంపిన తపన్.. రెండ్రోజుల తర్వాత కిల్లర్ రాకేష్‌ను వెంటబెట్టుకొని తాను వెళ్లాడు. అనుకున్న ప్రకారం మత్తు మందు ఇచ్చి గొంతు నులిమి చంపేశారు. అనంతరం కాలువలోకి పడేశారు. ఇక తిరిగి ఇంటికి వచ్చిన తపన్ త్వరలోనే ఉత్తమ్ వస్తాడని కుటుంబసభ్యులకు చెప్పాడు.. నమ్మించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజస్థాన్‌లోనే కరోనాతో చనిపోయాడని, వైద్యులు శవాన్ని ఖననం చేశారని రూపాదాస్, తపన్‌లు మొసలి కన్నీరు కార్చడం మొదలెట్టారు. ఉత్తమ్ డెత్ సర్టిఫికెట్ అవసరమవడంతో మళ్లీ రాజస్థాన్‌కు ప్రయాణమైన తపన్, రూపాదాస్‌లు, ఓ వ్యక్తికి డబ్బు ఆశ చూపించి డెత్ సెర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైద్యుడు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు నిజాలు బయట పడ్డాయి. నిందితులు కటకటాలా పాలయ్యారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..