నిన్న మిస్సింగ్.. నేడు చెరువులో ఇద్దరు మహిళల డెడ్‌బాడీలు.. ఏం జరిగింది.?

357

దిశ, జగిత్యాల : జగిత్యాలలో విషాదం నెలకొంది. పట్టణంలోని ధర్మసముద్రపు చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలను స్థానికులు కనుకొన్నారు. మరో యువతి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. వివరాల ప్రకారం.. పట్టణంలోని ఉప్పరిపేటకు చెందిన ఎక్కల్‌దేవి గంగాజల, వందన, మల్లిక అనే ముగ్గురు యువతులు బుధవారం అదృశ్యమయ్యారు.

అయితే.. గురువారం రోజున గంగాజల, మల్లిక మృతదేహాలను గ్రామస్తులు చెరువులో గుర్తించారు. దీంతో వందన కూడా మృతిచెంది ఉండవచ్చనే అనుమానంతో స్థానికులు చెరువులో గాలిస్తున్నారు. వీరిలో ఇద్దరికి వివాహం కాగా.. మరో యువతి ఇంటర్ చదువుతోందని బంధువుల ద్వారా తెలిసింది. అయితే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా.? లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై జగిత్యాల పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముగ్గురు యువతులు కూడా.. ఒకరికి ఒకరు బంధువులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..