ట్విట్టర్‌లో ఉమెన్ అథ్లెట్ల జోరు.. ట్రెండింగ్ నం.1గా ఆమె

by  |
ట్విట్టర్‌లో ఉమెన్ అథ్లెట్ల జోరు.. ట్రెండింగ్ నం.1గా ఆమె
X

దిశ, ఫీచర్స్ : ఒలింపిక్స్‌లో మహిళామణుల హవా నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరూ భారత ప్లేయర్లు రజత, కాంస్య పతకాలతో భారతావని ఉప్పోంగిపోయేలా చేశారు. తమ విజయంతో ఎంతోమంది యువతులకు స్ఫూర్తిగా నిలిచారు. హాకీ ఉమెన్స్ టీం కూడా అత్యద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. మరికొంతమంది అథ్లెట్లు విరోచితంగా పోరాడి ఓడారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో మహిళా క్రీడాకారుల పేర్లు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. పి.వి. సింధు, లవ్లీనా బోర్గో హైన్, మేరీ కోమ్‌తో పాటు మరికొన్ని పేర్లు ఈ జాబితాలో ఉండగా, టోక్యో2020 హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో నిలిచింది.

విశ్వక్రీడ సమరంలో ఇప్పటికే తొలి వారం గడిచి రెండో వారంలోకి అడుగుపెట్టాం. మీరాబాయ్ చాను రజతంతో, పీవీ సింధు కాంస్యంతో భారతమాత మెడలో రెండు పతకాలు వేయగా మైక్రో బ్లాగింగ్ సైట్‌లో వీరిద్దరి పేర్లు మార్మోగిపోతున్నాయి. భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను చేసిన ట్వీట్ ఇప్పటివరకు భారతీయ నెటిజన్లు ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక రీట్వీట్ చేసిన ట్వీట్. ఇక బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి. సింధు గురించి అత్యధికంగా చర్చించారు. లవ్లీనా, మేరీకోమ్, దీపికా కుమారి, అతాను దాస్‌ల పేర్లు కూడా ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలిచాయి. బాక్సింగ్, వెయిల్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్ క్రీడలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపించారు.

టాప్ హ్యాష్‌ట్యాగ్స్ :

గేమ్‌కు సంబంధించిన ట్వీట్లలో #టోక్యో 2020, #ఒలింపిక్స్, #చీర్4ఇండియా, #టోక్యో ఒలింపిక్స్, #టీమిండియా హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ట్విట్టర్ వెల్లడించింది. ఎక్కువగా ఉపయోగించే ఎమోజీలలో 👏 (క్లాప్ హ్యాండ్స్ ఎమోజి), 🥈 (సెకండ్ ప్లేస్ మెడల్ ఎమోజి), 🥇 (ఫస్ట్ ప్లేస్ మెడల్ ఎమోజి), 👍 (థంబ్స్ అప్ ఎమోజి) 🏅 (స్పోర్ట్స్ మెడల్ ఎమోజి) ఉన్నాయి.

మహిళా అథ్లెట్లు ట్విట్టర్ చార్ట్‌లలో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అగ్రస్థానంలో ఉన్నారు. ఒలింపిక్స్ సంభాషణలపై ప్రపంచవ్యాప్తంగా ప్రస్తావించిన ముగ్గురు అథ్లెట్లలో బ్రెజిలియన్ స్కేట్ బోర్డర్ రేస్సా లీల్, అమెరికన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ బ్రెజిలియన్ జిమ్నాస్ట్ రెబెకా ఆండ్రేడ్ ముందు వరసలో ఉన్నారు.


Next Story

Most Viewed