చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌లో జంట!

by  |
Woman Who Married Tree
X

దిశ, ఫీచర్స్ : ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ 2019లో ఒక చెట్టును పెళ్లిచేసుకుంది. ప్రాణంలేని ఆ చెట్టుతోనూ రెండేళ్లుగా అన్యోన్యంగా గడుపుతున్న ఆమె.. తమ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిందని, ప్రస్తుతం ఆ చెట్టుతో కలిసి మూడోసారి క్రిస్మస్‌ వేడుకలు జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నానని చెప్పడం విశేషం.

మెర్సీసైడ్‌, సెఫ్టాన్‌లోని రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్‌ వద్ద గల చెట్టును కేట్ కన్నింగమ్ అనే మహిళ వివాహం చేసుకుంది. అంతేకాదు తన పార్ట్‌నర్‌(చెట్టు) అంటే కేట్‌కు చెప్పలేనంత ఇష్టం కాగా.. వారానికి ఐదుసార్లు తనతో టైమ్ స్పెండ్ చేస్తుంది. ఇక క్రిస్మస్ వేడుక సందర్భంగా పుష్పాలు, టిన్సెల్‌, బబుల్స్‌తో చెట్టును అందంగా అలంకరించి తన ప్రేమను సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. ఇక కేట్‌‌కు బాయ్‌ఫ్రెండ్ కూడా ఉండగా.. అతను వారి సంబంధాన్ని అన్ని విధాలుగా సమర్థిస్తున్నాడు. ఈ మేరకు కేట్‌ తన భర్త(చెట్టు)ను చూసేందుకు వస్తే తను కూడా తోడుగా వెళ్తుంటాడు. ఆమె చెట్టుకు ముద్దులిస్తూ కౌగిలించుకునేటప్పుడు పక్కనే నిలబడతాడు. కాగా లాక్‌డౌన్స్ టైమ్‌లో ఈ బంధం మరింత బలపడిందని, కొన్నిసార్లు వారానికి ఐదుసార్లు చెట్టును చూసేందుకు వెళ్లేదాన్నని కేట్ వెల్లడించింది.

పెళ్లి తర్వాత ప్రస్తుతం మూడో క్రిస్మస్ జరుపుకుంటుండగా, తన పార్ట్‌నర్‌ను అందంగా అలంకరించింది కేట్. ఇదొక సంప్రదాయంగా మారిపోయిందని, డెకొరేషన్స్ పూర్తయ్యాక డిసెంబర్ ఎండలో తన చెట్టు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని చెప్తోంది. ఇందుకోసం హోలీ, ఐవీ, పైన్‌తో పాటు ఎరుపు రంగు శీతాకాలపు బెర్రీల నుంచి పుష్పగుచ్ఛాన్ని తయారు చేసిన కేట్.. ఫెస్టివల్ గ్లింప్స్ కోసం పర్‌ఫ్యూమ్ కూడా స్ప్రే చేసింది.

కాగా చట్టవిరుద్ధంగా చెట్లను నరకడం వంటి అంశాలపై అవగాహన పెంచేందుకు మెక్సికోలోని మహిళా కార్యకర్తలు అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంటారు. ఆ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొందిన కేట్ చెట్టుతో వివాహం చేసుకుంది. రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్‌‌ను ఇంగ్లండ్ హైవేస్‌కు సంబంధించి బైపాస్‌గా మార్చకుండా కాపాడే ప్రచారానికి వీలుగా తన వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ఆమె ఆశించింది.


Next Story

Most Viewed