- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సారూ.. డబుల్ బెడ్ రూం అందించండి
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామి ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో వాటి పంపిణీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన అక్కమ్మ లక్ష్మి అనే మహిళకు చెందిన పూరి గుడిసె ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. ప్రభుత్వం తరపున ఎలాంటి సహయం అంద లేదు. దీంతో అధికారులకు […]</p>

X
దిశ, సిద్దిపేట: ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామి ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో వాటి పంపిణీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన అక్కమ్మ లక్ష్మి అనే మహిళకు చెందిన పూరి గుడిసె ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. ప్రభుత్వం తరపున ఎలాంటి సహయం అంద లేదు. దీంతో అధికారులకు ఆమె విన్నవించారు. అయినా ఫలితం లేక పోయింది. ప్రభుత్వం తరపున ఆదుకోవాలనీ, తనకు డబుల్ బెడ్ రూం అందించాలనీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోలేదు. దీంతో కలెక్టర్‌కు బుధవారం ఆమె దరఖాస్తు సమర్పించింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
Next Story






