మహిళకు మందు తాగించిన ఫేక్ పోలీస్.. హోటల్‌లో నిర్బంధించి అత్యాచారం

by  |
andrapradesh news
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆడది ఒంటరిగా కనిపిస్తే బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారు. కామ కోరికలను తీర్చుకునేందుకు ఏదో ఒక సాకుతో దగ్గరై, అవసరం తీరాక హత్యలు చేసేందుకు బరితెగిస్తున్నారు. మహిళలకు రక్షణ, అత్యాచారాల నివారణ కోసం దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొంత మంది ప్రబుద్ధులు మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు. ఇందుకు నిదర్శనం నిర్భయ ఘటన జరిగిన దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘటన సంచలనం రేపుతోంది. ఉద్యోగం పేరుతో ఓ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేసేందుకు ప్రయత్నించిన ఫేక్ పోలీస్ వ్యవహారం ద్వారకలో ఆలస్యంగా వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే..

అంకిత్ సెహ్రావర్త్ అనే వ్యక్తి పోలీసు ఉద్యోగినంటూ ఓ మహిళను నమ్మించాడు. తెలిసిన చోట ఉద్యోగం ఇప్పిస్తాను.. ఒకసారి కలవాలని చెప్పాడు. అంకిత్ మాటలు విన్న సదరు మహిళ నవంబర్ 6వ తేదీన ద్వారకలో మీట్ అయింది. ఇదే సమయంలో బైక్‌పై వచ్చిన అంకిత్ సమీపంలోని హోటల్‌కి తీసుకెళ్లాడు. ఇది గమనించిన మహిళ చెక్‌ఇన్‌కి ముందు రూమ్‌లో బస చేసేందుకు నిరాకరించింది. దీంతో హోటల్ యజమాని తనకు తెలుసని.. భయపడాల్సిన అవసరం లేదని తాను పోలీస్ అంటూ మరోసారి చెప్పాడు.

అంకిత్ మోసపూరిత మాటలను గ్రహించని మహిళ రూములోకి వెళ్లింది. వెంటనే గడియపెట్టిన అతడు మందు తాగాలంటూ బలవంతం చేశాడని.. అనంతరం అత్యాచారం చేసి, పరారీ అయ్యాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఇనుపరాడ్డుతో ముఖం మీద కొట్టడమే కాకుండా, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడని, చివరకు రూములో బంధించి పరారీ అయ్యాడని పోలీసులకు ఫోన్‌కాల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది.

లైవ్‌ లొకేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హోటల్‌ రెండో అంతస్థు బాల్కనీలో బాధిత మహిళ కన్నీరుపెట్టుకోవడాన్ని గుర్తించినట్టు చెప్పారు. వెంటనే తాళాలు బద్ధలు కొట్టి బాధితురాలిని స్థానిక డీడీయూ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అత్యాచారం, హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్నామని.. ఇప్పటికే హోటల్ యజమాని సంజయ్‌ను అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న అంకిత్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వివరణ ఇచ్చారు.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పాము తలను ముద్దాడిన యువతి.. చివరకు..


Next Story

Most Viewed