నగ్నంగా మహిళ నిరసన

by  |
నగ్నంగా మహిళ నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలం క్రితం నల్లజాతీయుడు ‘జార్జ్ ఫ్లాయిడ్’ హత్యకు నిరసనగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఇప్పటికీ చాలా చోట్ల అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా అంతటా నిరసనలు జరిగినప్పటికీ చాలా ప్రాంతాల్లో సద్దమణిగాయి. కానీ పోర్ట్‌లాండ్‌లో మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై సోషల్ మీడియాలో విస్త్రృతంగా చర్చ జరుగుతోంది. ఓ మహిళ నగ్నంగా దూసుకొచ్చి.. పోలీస్‌లు ఎక్కుపెట్టిన తూటాలకు ఎదురెళ్లి నిలబడింది. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిదంటే..

రోజూలాగే జూలై 17 అర్ధరాత్రి పార్ట్‌‌లాండ్‌లోని ఓ కూడలి వద్ద స్థానికులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు. పెప్పర్ బుల్లెట్స్, రబ్బర్ బుల్లెట్స్ పేల్చి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ గుంపులోని ఓ మహిళ దూసుకొచ్చింది. ఆమె ఒంటిపై దుస్తులు లేవు. కేవలం ముఖానికి మాస్క్ మాత్రమే ధరించి ఉంది. జనాల్లోంచి దూసుకొచ్చిన మహిళ నేరుగా పోలీసుల వైపు వెళ్లింది. వారు తుపాకులు ఎక్కుపెట్టినా.. ఏ మాత్రం భయపడేలేదు. వారికి అతి దగ్గరగా వెళ్లి నగ్నంగా యోగాసనాలు చేసింది.

ఆమెను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసుల పెప్పర్ బుల్లెట్స్ పేల్చారు. కాళ్ల వద్ద వరుసగా పెప్పర్ బాల్స్ వదిలారు. అయినా వెళ్లిపోలేదు. ఈ క్రమంలో మరో ఆందోళనకారుడు ఆమె వద్దకు చేరుకొని రక్షణ కవచంగా నిలబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఆందోళనకారులు ఆమెను నేకె‌డ్ అథెనాగా అభివర్ణిస్తున్నారు. అథెనాను గ్రీకులు యుద్ధ దేవతగా ఆరాధిస్తారు. ఐతే పోర్ట్‌లాండ్‌లో నగ్నంగా నిరసన వ్యక్తం చేసిన ఆ మహిళ వివరాలు మాత్రం తెలియలేదు.



Next Story

Most Viewed