కుగ్రామం నుంచి మహిళా కోపైలట్.. సర్వత్రా అభినందనీయం

by Shyam |

<p>దిశ, ఫీచర్స్: ఆకాశంలో ‘విమానం’ ఎగురుతుంటే చిన్నప్పుడు దాన్ని అందుకోవాలని ప్రయత్నించింది. అందులో ప్రయాణించాలని కోరుకుంది. ఆ ఆశ క్రమక్రమంగా పైలట్‌ కావడానికి ప్రేరణగా నిలిచింది. 23ఏళ్ల కోరికను ఆమె నెరవేర్చుకుని, సగర్వంగా ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టింది. ఆ ధీరవనితే తిరువనంతపురానికి చెందిన జెన్నీ జెరోమ్. షార్జా నుంచి తిరువనంతపురానికి వెళ్లే ఎయిర్ అరేబియా జి 9 449 విమానంలో కో-పైలట్‌గా వ్యవహరించిన జెరోమ్, యావత్ భారతీయుల నుంచి ప్రశంసలతో పాటు, ప్రేమాభినాలు అందుకుంటోంది. రెండు దశాబ్దాలుగా [&hellip;]</p>

Jeni Jerome
X

దిశ, ఫీచర్స్: ఆకాశంలో ‘విమానం’ ఎగురుతుంటే చిన్నప్పుడు దాన్ని అందుకోవాలని ప్రయత్నించింది. అందులో ప్రయాణించాలని కోరుకుంది. ఆ ఆశ క్రమక్రమంగా పైలట్‌ కావడానికి ప్రేరణగా నిలిచింది. 23ఏళ్ల కోరికను ఆమె నెరవేర్చుకుని, సగర్వంగా ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టింది. ఆ ధీరవనితే తిరువనంతపురానికి చెందిన జెన్నీ జెరోమ్. షార్జా నుంచి తిరువనంతపురానికి వెళ్లే ఎయిర్ అరేబియా జి 9 449 విమానంలో కో-పైలట్‌గా వ్యవహరించిన జెరోమ్, యావత్ భారతీయుల నుంచి ప్రశంసలతో పాటు, ప్రేమాభినాలు అందుకుంటోంది.

రెండు దశాబ్దాలుగా యుఎఇలోని అజ్మాన్‌లో తన కుటుంబంతో కలసి నివసిస్తున్న జెన్నీ జెరోమ్, తిరువనంతపురంలోని కొచుతురా అనే కుగ్రామానికి చెందినది. తన పాఠశాల విద్యాభ్యాసం తరువాత ఆమె పైలట్ శిక్షణా కోర్సు పూర్తి చేసింది. అదే క్రమంలో తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకోవడానికి, తన తల్లి, సోదరుడితో కలిసి వారి స్వస్థలమైన త్రివేండ్రానికి వచ్చిన తను ఇటీవలే ఎయిర్ అరేబియా జి 9 449 విమాన కో-పైలట్‌గా వ్యవహరించి తన కలను సాకారం చేసుకుంది.

తండ్రి జెరోమ్ అజ్మాన్ లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఫ్యాబ్రికేషన్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, జెన్నీ సోదరుడు జెబి వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ‘చిన్నప్పటి నుంచి ఆమెకు విమానాలంటే ఎంతో ఇష్టం. ఇది కో పైలట్‌గా ఆమె మొదటి విమాన ప్రయాణం కావడంతో సహజంగా కొద్దిగా నెర్వస్‌గా ఉన్నా.. స్వస్థలానికి మొదటి విమాన ప్రయాణం పొందడం ఆమె అదృష్టం. కావున ఆమె చాలా సంతోషంగానే ఉంది’ అని తండ్రి జెరోమ్ అభిప్రాయపడ్డాడు. జెన్నీ తండ్రి జెరోమ్ సోషల్ మీడియాలో తన కూతురి విజయాన్ని పంచుకోగా, రాజకీయ, సినీ ప్రముఖులు కూడా జెన్నీని అభినందించడంతో ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘కో పైలట్‌గా తన తొలి విమాన ప్రయాణం చేస్తున్న ‘టివిఎం కొచుతురా’కు చెందిన జెన్నీ జెరోమ్‌కు అభినందనలు. నేడు ఆమె @airarabiagroup ఫ్లైట్ SHJ ని TRV కి ఫ్లై చేస్తుండటం నిజంగా అద్భుతం. ఒక చిన్న ఫిషింగ్ కుగ్రామం నుంచి ఓ వాణిజ్య పైలట్ కావాలనుకోవడం, దాన్ని సాకారం చేసుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం!’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశాడు.

Next Story