మద్యం మత్తులో మహిళ దారుణ హత్య.. లైంగిక దాడికి పాల్పడ్డారంటూ అనుమానం..

by Batti.Sumithra |

<p>దిశ, నల్లగొండ: జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు ఓ మహిళను హతమార్చి బంగారు నగలు ఎత్తుకు వెళ్లారు. ఈ విషాద ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముషంపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి భిక్షమయ్య, ధన లక్ష్మీ కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య యాదవ్ నిత్యం తాగుతూ భార్యతో [&hellip;]</p>

మద్యం మత్తులో మహిళ దారుణ హత్య.. లైంగిక దాడికి పాల్పడ్డారంటూ అనుమానం..
X

దిశ, నల్లగొండ: జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు ఓ మహిళను హతమార్చి బంగారు నగలు ఎత్తుకు వెళ్లారు. ఈ విషాద ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముషంపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి భిక్షమయ్య, ధన లక్ష్మీ కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య యాదవ్ నిత్యం తాగుతూ భార్యతో ఘర్షణ పడుతుండటంతో పుట్టింటికి వెళ్లింది. కుమ్మరి పుల్లయ్య తన భార్యను గత ఎనిమిదేళ్ల క్రితం హతమార్చి జైలుకు వెళ్లి వచ్చాడు. దీంతో వీరిద్దరు గ్రామంలో మద్యం సేవిస్తూ, ఎటువంటి పనిచేయకుండా తిరుగుతున్నారని గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది.

రోజులాగే పూటుగా మద్యం తాగిన లింగయ్య, పుల్లయ్యలు కిరాణ దుకాణం దగ్గరకు వెళుతున్న ధనలక్ష్మీ (54)అనే మహిళను బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లి హతమార్చి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలును దొచుకుని అక్కడినుంచి పారిపోయారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మహిళను వివస్త్రను చేసి, లైంగిక దాడికి పాల్పడి ఉంటారని, అనంతరం బంగారు నగులు తీసుకుని ఉడాయించారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గతేడాది ఇలాంటి ఘటనే నిడమనూరు మండలం ఇండ్లకోటయ్య గూడెంలో చోటుచేసుకోగా, అప్పటి ఎస్సై కొండల్ రెడ్డి విచారణ చేపట్టారు. కానీ ఇప్పటి వరకూ నిందితులు పట్టుబడలేదు.

Next Story